గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ డైనమిక్ నాయకత్వంలో, జాతీయ విద్యావిధానం 2020 యువ మనస్సులను సాధికారం చేయడం మరియు భవిష్యత్తు నాయకత్వ పాత్రల కోసం యువ అభ్యాసకులను పెంపొందించగల అభ్యాస పర్యావరణ వ్యవస్థను సృష్టించడంపై దృష్టి పెడుతుంది. ఈ లక్ష్యాన్ని పెంపొందించడానికి, యువ రచయితలకు మార్గదర్శకత్వం వహించే ఒక జాతీయ పథకం రేపటి నాయకుల పునాదిని సుస్థిరం చేయడానికి ఎంతగానో దోహదపడుతుంది.