హోమ్ | మైగవ్

ప్రాప్యత
ప్రాప్యత సాధనాలు
రంగు సర్దుబాటు
టెక్స్ట్ పరిమాణం
నావిగేషన్ సర్దుబాటు

కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

సృష్టించింది : 19/01/2017
పై యాక్టివిటీస్ లో పాల్గొనడం కొరకు క్లిక్ చేయండి

మంత్రిత్వ శాఖ ప్రధానంగా కంపెనీల చట్టం 2013, కంపెనీల చట్టం 1956, లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్ షిప్ చట్టం, 2008 మరియు ఇతర అనుబంధ చట్టాలు మరియు దాని క్రింద రూపొందించబడిన నియమనిబంధనల నిర్వహణకు సంబంధించినది.

పోటీపై ప్రతికూల ప్రభావాన్ని చూపే పద్ధతులను నివారించడానికి, మార్కెట్లలో పోటీని ప్రోత్సహించడానికి మరియు నిలబెట్టడానికి, ఈ చట్టం కింద ఏర్పాటు చేసిన కమిషన్ ద్వారా వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి పోటీ చట్టం, 2002 ను నిర్వహించడానికి మంత్రిత్వ శాఖ బాధ్యత వహిస్తుంది.

అంతేకాకుండా, సంబంధిత వృత్తులు సక్రమంగా, క్రమబద్ధంగా అభివృద్ధి చెందడానికి పార్లమెంటు మూడు వేర్వేరు చట్టాల కింద ఏర్పాటైన ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI), ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ICSI), ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) అనే మూడు ప్రొఫెషనల్ బాడీలపై కూడా ఇది పర్యవేక్షణ చేస్తుంది.

భాగస్వామ్య చట్టం 1932, కంపెనీల (జాతీయ నిధులకు విరాళాలు) చట్టం 1951, సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం 1980లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ విధులను నిర్వహించే బాధ్యత కూడా మంత్రిత్వ శాఖకు ఉంది.